ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలకృష్ణ నో చెప్పడం తో అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌ రీమేక్ లో వెంకటేశ్?

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 14, 2020, 01:13 PM

మలయాళ సూపర్‌ హిట్‌ అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌ సినిమా రీమేక్‌ గురించి గత కొన్ని రోజులుగా తెలుగు మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తున్న విషయం తెల్సిందే.భారీ మొత్తానికి ఈ సినిమా రీమేక్‌ రైట్స్‌ ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ దక్కించుకుంది.వైవిధ్యభరితమైన చిత్రంగా ప్రశంసలు అందుకోవడంతో, ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి సితార ఎంటర్టైన్మెంట్స్ వారు రంగంలోకి దిగారు.బాలకృష్ణ - రానా ప్రధాన పాత్రధారులుగా ఈ సినిమాను చేయాలనుకున్నారు. అయితే బాలకృష్ణ అంతగా ఆసక్తిని చూపలేదని సమాచారం. ఈ నేపథ్యంలోనే నిర్మాణ భాగస్వామిగా సురేష్ ప్రొడక్షన్స్ ముందుకు వచ్చిందట. దాంతో ఈ సినిమాలో వెంకటేశ్ - రానా నటించనున్నారనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. వెంకటేశ్ - రానా కాంబినేషన్లో ఒక సినిమా చేయాలనే ఉద్దేశంతో సురేశ్ బాబు ఉండబట్టి చాలా కాలమైంది. ఆ ముచ్చట ఈ సినిమాతో తీరుతుందని చెప్పుకుంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa