స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్‌ను బన్నీ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేశారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లుక్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. బన్నీ కళ్లలో ప్రతీకార సెగలు కనిపిస్తున్నాయని కామెంట్లు చేశారు. ఈ సినిమాలో బన్నీ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్‌గా నటిస్తుండగా హీరోయిన్ రష్మికా మందన్నా డీగ్లామర్ పాత్రలో కనిపించనుంది.సుకుమార్ - దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన చిత్రాల్లోని ఐటమ్ సాంగ్స్ విశేషమైన ఆదరణ పొందాయి. ఈ నేపథ్యంలో సుకుమార్ 'పుష్ప' సినిమాకి కూడా దేవీశ్రీని తీసుకున్నాడు.అయితే ఈ సినిమాకి ముందు బన్నీ చేసిన 'అల వైకుంఠపురములో' సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. ఆ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలిచింది. అందువలన తమన్ ను తీసుకుందామని బన్నీ అన్నప్పటికీ, ఆయనకి సర్ది చెప్పి దేవిశ్రీకే సుకుమార్ ఛాన్స్ ఇచ్చాడు. ఎలాంటి పరిస్థితుల్లో సుకుమార్ తనకి ఈ సినిమా ఇచ్చాడనే విషయం దేవిశ్రీకి తెలుసు. అందువలన 'పుష్ప' సినిమాతో కొత్తదనం చూపించాలనీ, తనేమిటనేది నిరూపించుకోవాలనే పట్టుదలతో దేవిశ్రీ వున్నాడని అంటున్నారు. ఇటీవల కాలంలో దేవిశ్రీ సంగీతంలో పస తగ్గిందనే విమర్శలకు ఆయన ఎలా చెక్ పెడతాడో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa