బోయపాటి శీను డైరెక్షన్ లో నందమూరి బాలకృష్ణ హీరో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. కానీ కరోనాతో వచ్చిన బ్రేక్ ను బోయపాటి స్క్రిప్ట్ కు ఉపయోగించుకుంటున్నాడు. కాగా తాజాగా ఈ సినిమా గురించి బోయపాటి ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు భారీ విజయాలను అందుకోవడంతో, తాజా ప్రాజెక్టుపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మార్చిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలెట్టి, జూలై 30వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. ఈలోగా కరోనా వైరస్ .. లాక్ డౌన్ కారణంగా ముందుగా వేసుకున్న ప్రణాళికలో మార్పులు చేసుకోవలసి వచ్చింది.లాక్ డౌన్ పూర్తికాగానే ఈ సినిమా షూటింగును మొదలుపెడతారట. సెప్టెంబర్ నాటికి అన్ని పనులను పూర్తి చేసి, దసరా కానుకగా అక్టోబర్లో ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. ఈ సినిమా ద్వారా బోయపాటి కొత్త కథానాయికను పరిచయం చేస్తున్నాడు. ఈ సారి దసరాకి బాక్సాఫీస్ దగ్గర భారీ సందడే వుండనుందన్న మాట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa