ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంద్రగంటి తో హీరో నాగ చైతన్య

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 17, 2020, 11:56 PM

ప్రస్తుతం నానీని హీరోగా నిలబెట్టిన దర్శకులలో ఇంద్రగంటి మోహనకృష్ణ ఒకరుగా కనిపిస్తాడు. ఆయన తెరకెక్కించిన 'అష్టాచెమ్మా' .. 'జెంటిల్ మేన్' నాని కెరియర్ కి ఎంతో హెల్ప్ అయ్యాయి. ఈ ఇద్దరి కాంబినేషన్లో మూడో సినిమాగా 'వి' రూపొందింది. నానీకి ఇది 25వ సినిమా కావడం విశేషం. టాలీవుడ్ లో మంచి అభిరుచి కలిగిన దర్శకుడిగా పేరుతెచ్చుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ. ప్రస్తుతం ఈ దర్శకుడు నాని, సుదీర్ బాబులతో ' వి' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈసినిమా తర్వాత ఇంద్రగంటి ఎవరితో సినిమా చేస్తారన్నది పై ఇంతవరకు క్లారిటీ రాలేదు. అయితే త్వరలో ఇంద్రగంటి యంగ్ హీరో తో సినిమా ప్లాన్ చేస్తున్నారని ఓ వార్త ఇప్పుడు ఫిలిమ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది. అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఇంద్రగంటి తో సినిమా చేసే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. వాతావనికి ఎప్పటినుంచో ఇంద్రగంటి చైతన్య తో సినిమా చేయాలని చూస్తున్నాడు. అయితే ఈమధ్య చైతూకు కథ చెప్పగానే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.త్వరలో ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa