సూపర్ స్టార్ మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా మహేశ్ బాబు తన తల్లికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. 'ఏప్రిల్ 20.. నా జీవితంలో చాలా ప్రత్యేకమైన వ్యక్తికి సంబంధించి, చాలా ప్రత్యేకమైన రోజు.. హ్యాపీ బర్త్ డే అమ్మ' అని మహేశ్ బాబు ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా గతంలో తన తల్లితో దిగిన ఫొటోను ఆయన పోస్ట్ చేశాడు.
తన ఫ్యామిలీతో పాటు వ్యక్తిగత విషయాలను, సినిమా విశేషాలను మహేశ్ బాబు సోషల్ మీడియో వేదికగా పంచుకుంటాడు. కాగా, ఇందిరాదేవి కృష్ణకు మరదలు అవుతుంది. ఆమెను కృష్ణ 1961లో పెళ్లి చేసుకున్నారు. కృష్ణ, ఇందిరలకు ఇద్దరు కొడుకులు,ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు రమేశ్ బాబు కొన్ని సినిమాల్లో నటించాడు. చిన్న కుమారుడు మహేశ్ బాబు టాలీవుడ్‌లో అగ్ర హీరోల్లో ఒకరిగా ఉన్నాడు.
April 20!! A very special day of the most special person in my life... Happy birthday Amma❤️❤️❤️ pic.twitter.com/OuxWEN4q7x
— Mahesh Babu (@urstrulyMahesh) April 20, 2020
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa