ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్ దేవర కొండ తదుపరి సినిమా డైరెక్టర్ ఆయనేనా...

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 21, 2020, 09:48 AM

విజయ్ దేవర కొండ చేసిన రొమాంటిక్ అండ్ ఎమోషనల్ లవ్ ఎంటర్‌ టైనర్ ‘వరల్డ్ ఫేమస్ లవర్’. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఢీలా పడింది. నాలుగు భిన్నమైన పాత్రల్లో ఎంతో కష్టపడి చేసిన విజయ్.. సినిమా వసూళ్లను మాత్రం పెద్దగా రాబట్టలేకపోయాడు. అయితే తాజగా డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమ్ అయిన ఈ సినిమా దుమ్ము లేపుతోంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాన్ని ఖాయం చేసుకున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో ఆ చిత్రాన్ని చేయనున్నాడు. ప్రస్తుతం 'టక్ జగదీశ్' చిత్రాన్ని రూపొందిస్తున్న శివ నిర్వాణ దీనికి దర్శకత్వం వహిస్తాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa