ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ‘బీ ది రియల్ మెన్’ అనే ఛాలెంజ్ నడుస్తోంది. దర్శకుడు సందీప్ రెడ్డి ఇంట్లో ఆడవాళ్లకు సాయం చేసే వాడే నిజమైన మగాడు అంటూ ‘బి ది రియల్ మేన్’ అనే ఛాలెంజ్ ప్రారంభించాడు. ప్రస్తుతం లాక్‌డౌన్ నేపథ్యంలో అందరు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి.. ఇంట్లో వాళ్లకు ఇంటి పనుల్లో తోచిన సాయం చేయమని చెప్పడమే ఈ చాలెంజ్ ఉద్దేశ్యం.. ఇందులో సినిమా ఇండస్ట్రీ కూడా ఉంది. లాక్‌డౌన్ కారణంగా అందరు సెలబ్రిటీలు ఎవరి ఇంట్లో వాళ్లు ఉంటున్నారు. దీంతో ఏమి చేయాలో తోచక ఒకరికొకరు డిఫరెంట్ ఛాలెంజెస్ విసురుకుంటున్నారు.రాజమౌళి కూడా ఎన్టీఆర్, రామ్ చరణ్ సహా పులువురిని నామినేట్ చేసారు. ఇక ఎన్టీఆర్ కూడా బాబాయి బాలకృష్ణతో పాటు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌లతో పాటు డైరెక్టర్ కొరటాల శివను నామినేట్ చేసిన సంగతి తెలిసిందే కదా.ఇక చిరంజీవి ఈ ఛాలెంజ్‌ను స్వీకరించారు. ఇక నాగార్జున, వెంకటేష్‌లను మినహాయిస్తే... బాలయ్య.. ఎన్టీఆర్ ఛాలెంజ్‌ను ఎలా స్వీకరిస్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలయ్య బాబు సోషల్ మీడియాలో ఫేస్‌బుక్ తప్పించి మిగతా వాటికి దూరంగా ఉన్నారు. అందులో కూడా ఆయన ఎఫుడు ఏ పోస్ట్ పెడతారో చెప్పడం కష్టమే. ఇక మొన్నటి వరకు సోషల్ మీడియకు దూరంగా ఉన్న చిరంజీవి.. ఉగాది సందర్భంగా అడుగుపెట్టి పూటకో పోస్ట్‌తో అభిమానులకు చాలా దగ్గరగా ఇంట్రాక్ట్ అవుతున్నారు. బాలయ్య కూడా ఈ ఛాలెంజ్‌తో సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వాలని బాలయ్య ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. మొత్తానికి అబ్బాయి ఎన్టీఆర్ ఛాలెంజ్‌ను బాబాయి బాలకృష్ణ ఏ విధంగా రియాక్షన్ ఇస్తారా అనేది నందమూరి అభిమానులతో పాటు సినీ ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa