ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీవితంలో చాలా కోల్పోయాను రకుల్ సంచలన నిజాలు..

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 22, 2020, 02:45 PM

రకుల్ ప్రీత్.. తెలుగు తెరకు ‘కెరటం’ సినిమాతో పరిచయమైన రకుల్, సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ లో నటించి మొదటి హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత నుండి తన అందంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ అదరగొట్టింది. అందులో భాగంగా ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది రకుల్. ఎప్పుడూ సమయం అనుకూలంగా ఉందదు కదా.. ఈ మధ్య ఈ భామ నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తుస్సుమనడంతో అవకాశాలు తగ్గాయి. దీంతో హిందీ సినిమాలపై దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు సింగిల్‌ గానే ఉందట.  అంతేకాదు ఇప్పటి వరకు తాను ఎవరినీ ప్రేమించలేదని చెప్పుకొచ్చింది. అందుకు కారణం తన తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్‌  అంటోంది ఈ భామ. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్  తన తమ్ముడుతో కలిసి ఓ‌ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని సంచలన నిజాలు బయటపెట్టింది. నా తమ్ముడు ఎపుడు నా నీడలా నా వెంటే ఉంటాడు. నా తమ్ముడు నన్ను ఎవరితో డేటింగ్ చేయనివ్వలేదు. స్కూల్‌లో చదువుతున్నపుడు నేను అబ్బాయిల పక్కన నిలబడితే... వెంటనే ఇంట్లో మా పేరెంట్స్‌కు కంప్లైట్ చేసేవాడు. ఒకసారి నేను ప్లేట్‌లో ఏవో పెట్టుకొని ఓ అబ్బాయి పక్కన ఊరికే నిలుచున్నాను. ఇక తమ్ముడు అది చూసి నేను ఆ అబ్బాయికి ఏదో తినిసిస్తున్నాని ఇంట్లో చెప్పేశాడంది. ఆ రకంగా నన్ను స్వేచ్ఛగా తిరగకుండా చేసాడు రాక్షసుడు అంటూ సరదగా నవ్వుతూ ఈ విషయాలను చెప్పింది. మరోవైపు అమన్ మాట్లాడుతూ.. నా వల్లే తను ఇలా ఉండిపోయిందనుకుంటాను. నేను అక్క స్కూల్ లైఫ్‌లో ఏమి చేయనీకుండా ఓ రకంగా చెప్పాలంటే ఇంట్లో చాడీలు చెబుతూ అక్కను ముప్పతిప్పలు పెట్టాను. అపుడు అలా చేసుండాల్సింది కాదని ఇపుడు అనిపిస్తోందన్నారు.ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్.. ఓ వైపు సినిమాలు.. మరోవైపు జిమ్ బిజినెస్ చేస్తోంది. ప్రస్తుతం ఈమె తన కుటుంబ సభ్యులతో కలిసి కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో తన తండ్రితో కలిసి గుర్గావ్‌లోని స్లమ్ ఏరియాలో ఉన్న 250 కుటుంబాలకు రెండు పూటల అన్నం పెడుతోంది. అంతేకాదు లాక్‌డౌన్ ఎఫ్పటి వరకు ఉంటే అప్పటి వరకు ఈ అన్నవితరణ కొనసాగుతుందని చెప్పుకొచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa