ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హీరో విజయ్ విరాళం..

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 22, 2020, 02:49 PM

ప్రపంచ దేశాలను కుదిపేస్తున్న కరోనా మహమ్మారిపై సమరానికి హీరో విజయ్ భారీ విరాళం ప్రకటించారు. ఇప్పటికే చాలా మంది హీరోలు కరోనా క్రైసిస్ కోసం విరాళం అందిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు తమిళ హీరో విజయ్ మాత్రం విరాళం ప్రకటించలేదు. దాంతో ఈయనపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు వాటికి సమాధానం చెబుతూ ఎట్టకేలకు ఈయన కూడా విరాళం ప్రకటించాడు. కోటి 30 లక్షల విరాళం అందిస్తున్నట్లు అనౌన్స్ చేసాడు విజయ్. అందులో తమిళనాడు మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాలకు కూడా ఈయన సాయం ప్రకటించడం గమనార్హం. ఈ మధ్య తెలుగులో కూడా విజయ్ సినిమాలు బాగానే ఆడుతున్నాయి. వరస విజయాలతో ఇక్కడ కూడా రప్ఫాడిస్తున్నాడు ఈ తమిళ హీరో.దాంతో ఇక్కడి ముఖ్యమంత్రుల సహాయ నిధికి కూడా విజయ్ విరాళం అందించాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో 5 లక్షలు ఇచ్చిన ఈయన.. కర్ణాటక, పాండిచ్చేరి ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 లక్షలు.. కేరళ ప్రభుత్వానికి 10 లక్షలు.. ఫిల్మ్ ఫెడరేషన్‌కు 25 లక్షలు.. తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షలు.. ప్రధాన మంత్రి సహాయ నిధికి 25 లక్షలు అనౌన్స్ చేసాడు విజయ్. ప్రస్తుతం ఈయన మాస్టర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. లాక్ డౌన్ అయిపోయిన తర్వాత సినిమా విడుదల కానుంది. తెలుగులో కూడా భారీగానే విడుదల చేస్తున్నారు మాస్టర్ సినిమాను.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa