ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిరంజీవి మొదటి సినిమా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 22, 2020, 03:13 PM

తెలుగు ఇండస్ట్రీకి చిరంజీవి రికార్డుల గ్యాంగ్ లీడర్. ఆయన సినిమా వచ్చిందంటే బాక్సాఫీస్ బద్ధలైపోవాల్సిందే. ఇప్పటికీ ఎప్పటికీ గ్యాంగ్ లీడర్ అంటే మెగాస్టార్ చిరంజీవి ఒక్కడే. ఆయన కెరీర్‌లో ఆ సినిమా చేసిన అద్భుతాలు కూడా అలాగే ఉన్నాయి.  మెగాస్టార్ చిరంజీవి అనుకుంటే ఇప్పుడు ఒక్కో సినిమాకు 50 కోట్లు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు నిర్మాతలు. ఈయన డేట్స్ ఇస్తే చాలు అంటూ వేచి చూస్తున్నారు. అలాంటి ఇమేజ్ సొంతం చేసుకున్నాడు ఈయన. అంతేకాదు ఇండియాలో తొలిసారి కోటి రూపాయల పారితోషికం అందుకున్న హీరో కూడా ఈయనే. బాలీవుడ్ హీరోలకు కూడా ఇది సాధ్యం కాలేదు. అప్పట్లో ఆపద్భాందవుడు సినిమా కోసం ఈయన కోటి రూపాయల పారితోషికం అందుకున్నాడు. ఆ తర్వాత వరసగా తన రేంజ్ పెంచుకుంటూ వచ్చాడు చిరు. మిగిలిన హీరోలు కోటి రేంజ్‌కు వచ్చేసరికి ఈయన రేంజ్ దానికి ఐదింతలు పెరిగిపోయింది.అలాంటి మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాడు. అసలు ఈయన తొలి సినిమాకు ఎంత తీసుకున్నాడనేది ఎవరికైనా తెలుసా..? తొలి రోజుల్లో డబ్బుల కంటే కూడా ఓ అవకాశం వస్తే బాగున్ను అని చూసేవాళ్లు చిరంజీవి బ్యాచ్. అప్పట్లో చాలా మంది అవకాశాల కోసం చూసేవాళ్లే కానీ పారితోషికం కాదు. ఎంత ఇచ్చినా కూడా తీసుకోవడం అప్పటి నటులకు అలవాటు. అలాగే చిరంజీవి కూడా తను కెమెరా ముందుకు తొలిసారి వచ్చిన సినిమా పునాది రాళ్లు.. అయితే ప్రాణం ఖరీదు ముందు విడుదలైంది.ఈ రెండు సినిమాలకు కూడా చిరంజీవికి ఎలాంటి పారితోషికం ఇవ్వలేదు. కానీ చిరు నటించిన మూడో చిత్రం మనవూరి పాండవులు సినిమాకు మాత్రం ఈయన అప్పట్లో 1,116 రూపాయాల పారితోషికం అందుకున్నాడు. కృష్ణంరాజు ఈ సినిమాలో హీరో. ఐదుగురు స్నేహితుల బ్యాచ్‌లో చిరంజీవి కూడా ఉంటాడు. ఆ సినిమాకు వెయ్యి నూట పదహార్లు అందుకోగానే చిరంజీవి ఆనందానికి అవధుల్లేవు.తన తొలి సంపాదనను అమ్మానాన్న చేతుల్లో పెట్టి వాళ్ల ఆశ్శీసులు అందుకున్నడు మెగాస్టార్. ఇక ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. 1983లో విడుదలైన ఖైదీ సినిమాతో తెలుగు సినిమాకు ఓ కొత్త శకం చూపించాడు చిరంజీవి. అప్పటి నుంచి ఇప్పటి వరకు చిరు అప్రతిహత జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa