ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తన తొలి రెమ్యూనరేషన్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది యాంకర్ అనసూయ

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 22, 2020, 06:13 PM

అనసూయ భరద్వాజ్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు బుల్లితెరపై ఓ సంచలనం ఈమె. పెళ్లైన తర్వాత కూడా కెరీర్ సక్సెస్ ఫుల్‌గా ముందుకు తీసుకెళ్లొచ్చని నిరూపించింది అనసూయ. ప్లానింగ్ సరిగ్గా ఉంటే సినిమాల్లో కూడా విజయం మీ వెంటే వస్తుందని చూపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈమె ప్రొఫెషనల్ లైఫ్‌లోనే కాదు.. వ్యక్తిగత జీవితంలో కూడా చాలా కష్టాలు పడింది. మరీ ముఖ్యంగా ప్రేమ విషయంలో అయితే అనసూయ చాలా కష్టాలు పడింది.  ఇటు బుల్లితెరపై .. అటు వెండితెరపై అనసూయకి మంచి క్రేజ్ వుంది. ఒక వైపున బుల్లితెరపై బిజీగా ఉంటూనే, మరో వైపున సినిమాల్లో తనకి నచ్చిన పాత్రలను మాత్రమే చేస్తూ వెళుతోంది. ఇక తీరిక సమయాల్లో ట్విట్టర్ ద్వారా అభిమానులతో ముచ్చటించడం ఆమె హాబీ. అలా తాజాగా ఆమె అభిమానుల ప్రశ్నలకు సమాధానంగా, తనకి సంబంధించిన కొన్ని విషయాలను పంచుకుంది.'మీ తొలి పారితోషికంతో ఏం చేశారు?' అనే ప్రశ్నకు, 'మా అమ్మకు గోల్డ్ రింగ్ కొనిచ్చాను. అది నాకు ఎంతో సంతోషాన్ని .. సంతృప్తిని ఇచ్చిన సందర్భం' అని సమాధానమిచ్చింది. 'ఛాలెంజింగ్ గా తీసుకుని మీరు చేసిన రోల్ ఏది?' అనే ప్రశ్నకు స్పందిస్తూ .. 'నేను ఇంతవరకూ ఛాలెంజింగ్ అనుకుని చేసిన రోల్ ఏదీ లేదు .. ఎందుకంటే అసలు అలాంటి రోల్ నాకు రాలేదు' అని చెప్పింది. అలాగే తదుపరి సినిమాల గురించి అడిగిన ప్రశ్నకి, 'ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నాను. అయితే లాక్ డౌన్ కారణంగా ఆ సినిమాల షెడ్యూల్స్ అన్నీ కూడా గజిబిజిగా మారిపోయాయి' అని బదులిచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa