రాజమౌళి మహేష్ తో మూవీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ మూవీ తరువాత ఆయన చేసే మూవీ మహేష్ తోనే అని ఆయన కన్ఫర్మ్ చేశారు. ఏడెనిమిదేళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చాల్సివుండగా రాజమౌళి మిగతా ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉండడం వలన కుదరలేదు. సీనియర్ నిర్మాత కే ఎల్ నారాయణ మహేష్ తో మూవీ కొరకు రాజమౌళికి అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ ని రాజమౌళి అధికారికంగా ప్రకటించగా, 2022లో సెట్స్ పైకి వెళ్లే సూచనలు కలవు. ఐతే ఈ మూవీకి కథను ఇంకా ఎంపిక చేయలేదని రాజమౌళి స్వయంగా చెప్పగా లాక్ డౌన్ సమయాన్ని అందుకు ఉపయోగిస్తున్నారని తెలుస్తుంది. రాజమౌళి సినిమాలకు తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తారన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి మధ్య కథా చర్చలు మొదలయ్యాయట. విజయేంద్ర ప్రసాద్ దగ్గర ఉన్న కొన్ని స్టోరీ లైన్స్ రాజమౌకి ఆయన వినిపిస్తున్నారట. రాజమౌళి స్టోరీ లైన్ ఎంపిక చేస్తే దాన్ని డెవలప్ చేయాలని ఆయన ఆలోచనట. మరి వీరిద్దరూ కలిసి మహేష్ కోసం ఎలాంటి కథ వండుతారో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa