ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్ ఆర్ ఆర్ నుంచి కొత్త అప్డేట్ ... !

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 23, 2020, 05:42 PM

రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ ని కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల పాత్రల ఆధారంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కథా కథనాలపై అనేక ఊహాగానాలు, అనుమానాలు, పుకార్లు ఉన్నాయి. ఐతే రాజమౌళి ఇది ఊహాజనితమైన కథ మాత్రమే, చరిత్ర ఆధారంగా తెరకెక్కించినది కాదని తెలియజేడం జరిగింది. ఇక చరణ్ పుట్టిన రోజు కానుకగా విడుదల చేసిన చరణ్ ఫస్ట్ లుక్ వీడియోతో అనుమానాలు తార స్థాయికి చేరాయి.చరణ్ ని పోలీసుగా పరిచయం చేసి, ఆర్ ఆర్ ఆర్ కథ అసలు చరిత్రకు పొంతన లేకుండా సాగుతుందని తెలియజేశాడు. ఈ చిత్రంలో ఒకప్పటి ఇద్దరు ఉద్యమ వీరులు ఉండడంతో ఈ మూవీ దేశభక్తి వంటి భావాజాలం ఉంటుందని భావిస్తే అది పొరపాటే అని రాజమౌళి చెవుతున్నారు. ఈ మూవీ దేశభక్తి కోణంలో తెరకెక్కిన సినిమా కాదని జక్కన్న క్లారిటీ ఇచ్చారు. ఇక మే 20న ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో వస్తే ఈ మూవీపై కొంత స్పష్టత రావచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa