ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభాస్ ,నాగ్ అశ్విన్ సినిమాలో కైరా

cinema |  Suryaa Desk  | Published : Sun, Apr 26, 2020, 11:21 AM

ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. మహానటితో సూపర్ పాపులర్ అయిన నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నాడు. దీనికి సంబందించి అధికారిక ప్రకటన కూడా ఇటీవల విడుదలైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ‘జాన్’ చిత్రం పూర్తవగానే ఈ సినిమా మొదలవుతుంది. ఇందులో హీరోయిన్ పాత్రకు బాలీవుడ్ నటి కైరా అద్వానీని ఎంపిక చేసినట్టు సమాచారం. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa