ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైద్యుల పుష్పాభివందనం పై చిరంజీవి ట్వీట్

cinema |  Suryaa Desk  | Published : Sun, May 03, 2020, 04:12 PM

చిరంజీవి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉగాది రోజున మొదలైన ట్వీట్ల దండయాత్రం అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. మంచి సందేశాలు ఇవ్వడానికి, తన సహచర నటీనటులకు, దర్శకులకు సెటైర్స్, పంచ్‌లు వేయడానికి ఈ మాధ్యమాన్ని బాగానే వాడుకుంటున్నాడు. చిరు వేసే ట్వీట్స్ కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారంటే అది అతిశయోక్తి కాదు. ఎప్పుడు ఎవరికి మూడుతుందో.. ఎవరి మీద సెటైర్స్ వేస్తారో అని ఆత్రుతగా చూస్తుంటారు నెటిజన్స్.‘కరోనా’ కట్టడికి ముందు వరుసలో ఉండి పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసుల సేవలను కేంద్రం ప్రశంసిస్తూ..  గగనతలం నుంచి హెలికాఫ్టర్ల ద్వారా వారిపై పూల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రముఖ హీరో చిరంజీవి స్పందించారు.సరిహద్దులు దాటి వచ్చే ఉగ్రవాదులపై పోరాడి దేశాన్ని కాపాడే వీర సైనికులు,  కనిపించని వైరస్ అందరిపై దాడి చేస్తుంటే, అహర్నిశలు మనల్ని కాపాడేందుకు తమ ప్రాణాలు పణంగా పెట్టి ముందు  వరుసలో ఉండి పోరాడుతున్న యోథులకు పుష్పాభివందనం చేయడం అభినందనీయమని ప్రశంసించారు. కరోనా పై పోరాడుతున్న వారికి,  వీర సైనికులకు తాము రుణపడి ఉన్నామని ప్రశంసిస్తూ చిరంజీవి ఓ ట్వీట్ చేశారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa