ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త‌ల్లి పాత్రలపై రేణూదేశాయ్‌ రేణూదేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు...

cinema |  Suryaa Desk  | Published : Sun, May 03, 2020, 04:18 PM

ఇటీవ‌ల మీడియాతో చేసిన చిట్ చాట్ లో రేణూ దేశాయ్ ఈ విష‌యంపై స్పందించారు. మ‌హేశ్, ప్ర‌భాస్ లాంటి స్టార్ హీరోల‌కు త‌ల్లి పాత్ర చేసే అవ‌కాశ‌మొస్తే..చేస్తారా? అని ప్ర‌శ్నించారు.దీనిపై రేణూ దేశాయ్ స్పందిస్తూ..తాను మ‌హేశ్, ప్ర‌భాస్ వంటి హీరోల చిన్న‌ప్ప‌టి పాత్ర‌ల‌కు త‌ల్లి గా న‌టించేందుకు రెడీ అని స్ప‌ష్టం చేశారు. ఏ డైరెక్ట‌ర్ అయినా త‌న‌ను ఎవ‌రైనా వృద్దాప్య ఛాయలున్న‌ పాత్ర‌ల్లో చూపించ‌గ‌ల‌ర‌ని అనుకుంటే..మ‌హేశ్ లాంటి హీరోల‌కు త‌ల్లిగా న‌టించేందు తాను రెడీ అని చెప్పారు. తాము క‌ళాకారులమ‌ని, అవ‌స‌ర‌మైతే ఎలాంటి పాత్ర చేసేందుకైనా సిద్దంగా ఉండాల‌ని రేణూదేశాయ్ చెప్పుకొచ్చారు.  అవసరమైతే, మేకప్ వేసుకుని వృద్ధురాలి పాత్రలు వేసేందుకు తనకు అభ్యంతరం లేదని అన్నారు. కాగా, రైతు నేపథ్యంలో ఓ చిత్రం తీయబోతున్న రేణూదేశాయ్ ఈ ప్రాజెక్టు నిమిత్తం ఇటీవల ఓ గ్రామానికి వెళ్లారు. అక్కడి ప్రజలను, చిన్నారులను కలిశారు. ఇందుకు సంబంధించిన వీడియోను రేణూ దేశాయ్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సినిమా తన మనసుకు ఎంతో దగ్గరైందని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa