ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆహారం ఆసక్తికర విషయాలు తెలిపారు:కమల్ హాసన్

cinema |  Suryaa Desk  | Published : Sun, May 03, 2020, 04:24 PM

నటుడు విజయ్‌ సేతుపతితో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా తన ఫిట్‌నెస్‌ రహస్యం గురించి ముచ్చటించారు. ఆహారం విషయంలో ఏ మాత్రం రాజీపడనని, పరిమితులు లేకుండా నచ్చినంత తింటానని అన్నారు.‘ఆహారం విషయంలో మాత్రం నన్ను నేను నియంత్రించుకోలేను. నా తిండి గురించి, నాకంటే నాకు దగ్గరి వాళ్లు బాగా వివరిస్తారు. ఓసారి నేను తినే తిండి చూసి.. శివాజీ సర్‌ షాక్‌ అయ్యారు. గతంలో ఒకసారి తాను తినే తిండి చూసి నటుడు శివాజీ విస్మయానికి గురయ్యారని కమల్ తెలిపారు. గతంలో తాను రోజుకు 14 కిలో మీటర్లు పరిగెత్తేవాడిని, అయితే, తనకు ప్రమాదం జరిగిన తర్వాతి నుంచి తాను అంత దూరం పరిగెత్తలేకపోతున్నానని చెప్పారు.అభయ్‌ సినిమాలో తన పాత్ర కోసం కండలు పెంచడానికి చేసిన కసరత్తు గురించి ఆయన వివరించి చెప్పారు. ఆ చిత్రంలో తాను సన్నగా కనిపించాలని మొదట అనుకున్నానని తెలిపారు. అయితే, కొందరికి అలాంటి శరీరాకృతి నచ్చలేదని తెలిపారు.దీంతో ఆ పాత్ర కోసం తాను మాంసాహారం బాగా తీసుకున్నానని చెప్పారు. రోజుకు 32 గుడ్లు తినేవాడినని, అలాగే, చికెన్ బాగా తినేవాడినని తెలిపారు. అన్ని గుడ్లు తినే సరికి ఆ సినిమా షూటింగ్‌ పూర్తయిన తర్వాత తనకు గుడ్లపై విరక్తి వచ్చేసిందని కమల్ తెలిపారు. దీంతో మరో ఏడాది పాటు గుడ్లను తినలేదని వివరించారు.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa