వేసవిలో ఎయిర్ కండిషనర్ల వాడకం పెరిగింది. ఏసీకి శరీరం అలవాటు పడుతుందా లేదా అనేది సందేహంగా మారింది. ఆరోగ్య నిపుణుల ప్రకారం ఏసీకి అలవాటుపడటం ఒక వ్యాధి కాదు, కానీ శరీరం చల్లని వాతావరణానికి అలవాటు పడి, బయటి వేడిని తట్టుకోలేక అసౌకర్యంగా మారుతుంది. ఏసీ వాడకం వల్ల చర్మం, కళ్ళు, గొంతు పొడిబారడం, రోగనిరోధక శక్తి తగ్గడం, కండరాల నొప్పులు, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఏసీ అలవాటును మానుకోవడానికి మట్టి కుండ నీరు తాగడం, తడి పరదాలు వాడటం, సరైన ఆహారం తీసుకోవడం, కాటన్ దుస్తులు ధరించడం, క్రాస్ వెంటిలేషన్, ఇండోర్ ప్లాంట్స్ వంటి సహజ పద్ధతులను పాటించాలని సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa