లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లకు బ్రేక్ పడింది. దీంతో నటీనటులు, దర్శకనిర్మాతలు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఇంట్లో రకరకాల పనులు చేస్తూ వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో నటి రకుల్ ప్రీత్ సింగ్ ఓ షార్ట్ ఫిల్మ్ రూపొందించి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన సంగతి తెల్సిందే. తాజాగా, తన తమ్ముడు అమన్ తో కలిసి, చిన్నప్పుడు ఆడిన దిండూ-దెబ్బ, కబడ్డీ, పులుసు ఆటలు ఆడింది. దీనికి సంబంధించిన వీడియోను ఇంస్టాగ్రామ్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..తాను చేసిన యోగా వీడియోలను, సరదాగా చేసిన వీడియోలను ఇప్పటికే పోస్ట్ చేసిన రకుల్, తాజాగా, పలు రకాల ఆటలను ఆడుతున్న వీడియోను పెట్టగా, అదిప్పుడు వైరల్ అవుతోంది. అమన్ తో కలిసి 'దిండూ - దెబ్బ', 'కబడ్డీ', 'పులుసు' ఆటలు ఆడింది. ఇక ఈ ఆటలను చిన్నప్పుడు ఆడుకున్నానని, ఇప్పుడు వాటన్నింటినీ గుర్తు చేసుకున్నానని, ఇటువంటి సమయం ఎవరినైనా బాల్యంలోకి తీసుకెళ్తుందని వ్యాఖ్యానించింది. ఎంతో ఆకట్టుకుంటున్న ఈ వీడియోను మీరూ చూడవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa