ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హీరో, హీరోయిన్ల రెమ్యూనరేషన్స్ పై సురేష్ బాబు సంచనల వ్యాఖ్యలు

cinema |  Suryaa Desk  | Published : Sun, May 03, 2020, 04:41 PM

కరోనావైరస్ ప్రపంచమంతా వేగంగా వ్యాపిస్తుండటంతో.. ఈ వైరస్ విస్తరణ గురించి ప్రతి రోజూ కొత్త వార్తలు వస్తున్నాయి.ఈ వైరస్ సోకే ప్రమాదాల గురించి ప్రతి ఒక్కరిలో ఆందోళన పెరుగుతోంది. దీని ప్రభావం సినీ రంగంపై మరికొంత కాలం పాటు ఉంటుందని నిర్మాత సురేశ్ బాబు అన్నారు. ఈ మహమ్మారి వ్యాప్తి ఎలా ఉండబోతుందో చెప్పలేమని తెలిపారు. పరిశ్రమ నష్టాల్లో ఉన్న ఈ సమయంలో హీరో, హీరోయిన్లు, దర్శకులతో పాటు అందరూ పారితోషికాలు తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. విడతలవారీగా లాక్ డౌన్ ఎత్తేసినంత మాత్రాన థియేటర్లు తెరుచుకోవని చెప్పారు. చిన్న సినిమా షూటింగులు జరగొచ్చని... ఎక్కువ మంది ఆర్టిసులు అవసరమయ్యే సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు మాత్రం ఇబ్బంది పడొచ్చని అన్నారు. ప్రస్తుతం కొన్ని డబ్బింగ్ సినిమాలు ఉన్నాయని... ముందు వాటిని పూర్తి చేసుకుంటే కొంత డబ్బు సంపాదించుకోవచ్చని చెప్పారు.కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఇబ్బందులు తప్పవని సురేశ్ బాబు తెలిపారు. వర్క్ ఫ్రమ్ హోం వల్ల సినీ పరిశ్రమకు మేలు జరిగే అవకాశం ఉందని... సాయంత్రం వరకు ఇంట్లో ఉండి పని చేసినవారు... సాయంత్రాలు రెస్టారెంట్లు, థియేటర్లు, పార్కులకు వెళ్లే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా అడుగులేస్తూ ముందుకు సాగాలని... లేకపోతే ప్రపంచమే నిలబడిపోయే ప్రమాదం ఉందని అన్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa