ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఉందా ? లేదా ?

cinema |  Suryaa Desk  | Published : Mon, May 04, 2020, 11:15 AM

‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో పైగా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ చిత్రం పై ఆరంభం నుండి భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. మే 20న తారక్ బర్త్ డే రోజున తారక్ పాత్ర మీద జక్కన్న ఎలాంటి వీడియోను రిలీజ్ చేయనున్నాడో అని గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వీడియోకి సంబంధించిన అవుట్ ఫుట్ లేకపోవడం, షూట్ చేయడానికి అవకాశం లేకపోవడంతో రాజమౌళి వీడియోను కాకుండా, పోస్టర్ ను రిలీజ్ చేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సర్ ప్రైజ్ చేయాలనుకుంటున్నాడట. ఇక ఈ సినిమాలో క్రేజీ బ్యూటీ ఆలియా భట్ చరణ్ సరసన, అలాగే ఎన్టీఆర్ కి జోడీగా ఒలివియా మోరిస్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. మొత్తానికి రాజమౌళి ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందించడానికి బలంగానే ట్రై చేస్తున్నాడు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa