సిని ఇండస్ట్రీలో రోడ్డు ప్రమాదంలో యువ నటుడు కన్నుమూయడం కన్నీరు పెట్టిస్తుంది. మలయాళ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్న బేసిల్ జార్డ్ యాక్సిడెంట్‌లో మరణించాడు.ఈయనతో పాటు డ్రైవర్ మరో ముగ్గురు మొత్తం ఐదుగురు ఒకే కారులో కొలెంచెర్రీ నుంచి మువత్తపుజా వైపు వెళ్తున్న సమయంలో కారుపై డ్రైవర్ అదుపు కోల్పోవడంతో ఎదురుగా ఉన్న షాప్, ఓ ఇంటిని ఢీ కొట్టింది. ఈ ఘటన మువట్టుపుజా దగ్గర ఆదివారం రాత్రి చోటు చేసుకుందని తెలిపారు పోలీసులు. ఈ దుర్ఘటనలో బేసిల్ జార్జ్‌తోపాటు మరో ఇద్దరు మరణించారు. ప్రమాదానికి గురైన వాళ్లకు ఫైర్, పోలీస్ సిబ్బంది కాపాడి వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. మువట్టుపుజా దగ్గర జరిగిన కారు ప్రమాదంలో అక్కడే ఉన్న వలస కార్మికులు తృటిలో తప్పించుకున్నారు.కారు ఢీ కొట్టిన ఓ చిన్న ఇంటిలో కొందరు వలస కార్మికులు ఆశ్రయం పొందుతున్నారు. ఆ ఇంటినే ఢీకొట్టడంతో కొందరికి స్వల్పంగా గాయమయ్యాయని.. వాళ్లను వెంటనే ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించినట్లు తెలిపారు పోలీసులు. ఈ ఘటనలో బెసిల్, నిధిన్, అశ్విన్ జాయ్ ప్రమాదం జరిగిన వెంటనే మార్గమధ్యంలో మరణించారు. వారిని హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మరణించారని వైద్యులు ధృవీకరించారు. కారు ప్రమాదంలో ముగ్గురు వలస కార్మికులకు గాయాలయ్యాయని తెలుస్తుంది.వాళ్లకు కొలెంచెర్రీ మెడికల్ హాస్పిటల్‌లో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన ముగ్గురికి మే 4న అంత్యక్రియలు పూర్తి చేసారు. లాక్‌డౌన్ కావడంతో ఎవ్వరూ బేసిల్ జార్జ్ భౌతిక కాయాన్ని చూడ్డానికి కూడా రాలేదు. ఇప్పడిప్పుడే మలయాళ సినిమా పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకుంటున్న ఈయన ఇప్పుడు ఇలా మరణించడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈయన నటించిన పూవల్లియమ్ కుంజడమ్ సూపర్ హిట్ అయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa