ఇప్పటి జనరేషన్ కి బాపు అంటే అత్తారింటికి దారేది సినిమాలో "బాపు గారి బొమ్మ" పాట ద్వారా తెలుసనుకుంటా. కానీ అప్పట్లో మన బాపు గారి గీసిన చిత్రాలు పికాసోతో పోలుస్తారు. ఆయన కళా నైపుణ్యానికి ఇచ్చిన పద్మ శ్రీ , 2 ఫిలింఫేర్ అవార్డ్స్ , 7 నంది అవార్డ్స్ మరియు 2 నేషనల్ అవార్డ్స్ ఏవి కూడా సరిపోవు.15 December 1933 లో జన్మించిన బాపు గారి అసలు పేరు సత్తిరాజు లక్ష్మి నారాయణ. డ్రాయింగ్స్ తో పాటు సినిమాల లో డైరెక్టర్ మరియు స్క్రీన్ రైటర్ గ కూడా పని చేసారు. వారు మొత్తం 36 సినిమాలుకు direction వహించారు, అందులో 9 సినిమాలు బాలీవుడ్ కోసం ప్రత్యేకంగా తీశారు .వీరిలాగే మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన కవి , రచయిత మరియు నటులు ఎవరైనా ఉంటె మాతో కింద కామెంట్స్ లో షేర్ చేసుకోండి . అలాగే పైన పోస్ట్ చేసిన బాపు బొమ్మలతో మీకు నచ్చినది ఎదో మాకు కామెంట్స్ లో తెలియ చేయండి .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa