ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ పాత్రను చేయాల్సింది కాదు పొరపాటు చేశాను : యాంకర్ రష్మీ

cinema |  Suryaa Desk  | Published : Thu, May 07, 2020, 06:02 PM

బుల్లితెర మీద పేరు గడించిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. సినిమాలతో ఎంట్రీ ఇచ్చినా ఆపై బుల్లితెరపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. సినిమాలు చేస్తూ వెండితెరమీద సైతం బిజీబిజీగానే ఉంటోంది నటి రష్మీ.  కొంతకాలంగా సినిమాల సంఖ్యను తగ్గించుకుంటూ వచ్చిన ఆమె, బుల్లితెరపై మాత్రం తన జోరు చూపిస్తోంది. తాజా ఇంటర్వ్యూలో రష్మీ మాట్లాడుతూ ..  "బుల్లితెరపై నాకున్న క్రేజ్ వెండితెరపై అవకాశాలను తెచ్చిపెట్టింది. దాంతో ఒక్కో సినిమా చేస్తూ వెళ్లాను.ఈ క్రమంలోనే 'గుంటూరు టాకీస్' సినిమా చేశాను. ఆ సినిమాలో నేను సెక్సీగా .. గ్లామర్ డోస్ పెంచేస్తూ కనిపించడం చూసి అభిమానులు షాక్ అయ్యారు.  ఆ సినిమా తరువాత నుంచి నాకు అదే తరహా పాత్రలు రావడం మొదలుపెట్టాయి. దాంతో ఒకే కేటగిరికి సంబంధించిన పాత్రలను చేయవలసిన పరిస్థితి ఏర్పడింది.  వైవిధ్యభరితమైన పాత్రలను చేయాలనే నా ఆశ నిరాశ అయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ పాత్రను ఒప్పుకుని చాలా పొరపాటు చేశాననే  చెప్పాలి. ఇకపై అలాంటి పాత్రలను ఎలాంటి పరిస్థితుల్లోను ఒప్పుకోను" అని చెప్పుకొచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa