ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైజాగ్‌ ఘటనపై స్పందించిన ఎన్టీఆర్, రామ్ చరణ్...

cinema |  Suryaa Desk  | Published : Thu, May 07, 2020, 06:08 PM

విశాఖపట్నంలోని గ్యాస్ లీక్ ఘటన దేశ వ్యాప్తంగా అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. తెల్లవారుజామున పరిశ్రమను తెరవబోతుండగా.. స్టైరిన్ గ్యాస్ లీకై చుట్టుపక్కల ఉన్న వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం దాదాపు 1500 ఇళ్లను ప్రభుత్వం ఖాళీ చేయించింది. అక్కడి ప్రజలందర్నీ సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ప్రస్తుతం 180 మంది కేజీహెచ్‌లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 40 మందిని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనే సృష్టించింది. ఇప్పటికే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని మంత్రి, కేంద్ర మంత్రలతో పాటు ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు ఈ ఘటపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే కదా. బాధితులను ఆదుకునేందుకు అండగా నిలుస్తామని ఏపీ ప్రభుత్వానికి కేంద్రం  హామి ఇచ్చింది. అంతేకాదు బాధిత ప్రాంతాల్లో విపత్తు దళాలు ప్రజలు సాయం చేయడంలో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే ఈ  ఘటనపై చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రవితేజ పలువురు అగ్ర నటులు తీవ్ర విచారం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే కదా.


తాజాగా వైజాగ్‌లో జరిగిన ఘటనపై ఆర్ఆర్ఆర్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ స్పందించారు.వైజాగ్ గాస్ లీక్ వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ప్రభావిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ ట్వీట్ చేసాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa