వరసగా సినిమాలు చేసి త్వరగా రాజకీయాలు చేసుకుందామనుకున్న పవన్ ప్లాన్స్‌కు భారీగానే గండి కొట్టింది కరోనా వైరస్. ఈ వైరస్‌తో లాక్‌డౌన్ విధించారు.. దాంతో అనుకున్న సమయానికి ఒక్క పని కూడా కావడం లేదు. అనుకున్న షూటింగ్స్ కూడా అన్నీ ఆగిపోయాయి. దాంతో ఈ ఏడాది విడుదల చేద్దామనుకున్న క్రిష్ సినిమా కాస్తా వచ్చే ఏడాదికి వాయిదా పడేలా కనిపిస్తుంది. దాంతో పాటు మే 15న విడుదల అనుకున్న వకీల్ సాబ్ కూడా ఎప్పుడొస్తుందో తెలియదు. మొత్తంగా పవన్ వేసుకున్న ప్లాన్స్ అన్నీ ఇప్పుడు ఎటూ కాకుండా పోయాయి.చాలా ప్రణాళికా బద్ధంగా సినిమాలకు, రాజకీయాలకు టైమ్ కేటాయించుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. అందుకే ఒకేసారి మూడు సినిమాలు ఒప్పుకున్నా కూడా అన్నీ అనుకున్న టైమ్‌కు పూర్తి చేస్తానని మాటిచ్చాడు. చెప్పినట్లుగానే దాదాపు నెల రోజులు రెండు షిఫ్టులు పని చేసాడు. పగలు ఓ సినిమా.. రాత్రి మరో సినిమా షూటింగ్ చేసాడు. అయితే లాక్‌డౌన్ కారణంగా అన్నీ ఆగిపోవడంతో పవన్ ఆలోచనలో పడిపోయాడు. పరిస్థితులు మెరుగుపడిన తర్వాత వకీల్ సాబ్ మిగిలిన వర్క్ పూర్తి చేసి.. క్రిష్ సినిమాను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు.ముందు క్రిష్‌తో పాటే హరీష్ శంకర్ సినిమాను కూడా పూర్తి చేయాలనుకున్నాడు పవన్. కానీ ఇఫ్పుడు అలా కాకుండా ప్లాన్ మార్చేసినట్లు ప్రచారం జరుగుతుంది. క్రిష్ సినిమాను పూర్తి చేసిన తర్వాతే హరీష్ శంకర్ సినిమా వైపు పవన్ అడుగులు పడనున్నాయి. దాన్ని కూడా కేవలం ఆర్నెళ్లలోనే పూర్తి చేయాలని చూస్తున్నాడు. 2022 వరకు ఈ మూడు సినిమాలు విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు పవర్ స్టార్. ఆ తర్వాత మళ్లీ రాజకీయాల్లో బిజీ కానున్నాడు జనసేనాని. ఏదేమైనా కూడా అనుకోకుండా వచ్చిన వైరస్ కాస్తా పవన్ ప్లాన్స్ అన్నీ పాడు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa