ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమంత జిమ్ పాఠాలు..

cinema |  Suryaa Desk  | Published : Thu, May 14, 2020, 09:44 AM

ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో రోజు చేసే ఎక్సర్‌సైజ్‌లను అభిమానులకు పరిచయం చేసింది. ఆన్‌లైన్‌లో తన ట్రైనర్ సందీప్ రాజ్ సూచనలు తీసుకొని ఫిట్‌గా తయారయ్యేపనిలో పడింది. ఈ సందర్భంగా తీసిన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్ చేసింది. లాక్‌డౌన్ సమయంలో సమంత చేస్తోన్న వర్కౌట్స్ చూసి అభిమానులు పొగడ్తలతో ముంచెత్తున్నారు.  అంతేకాదు రీసెంట్‌గా సమంత తన భర్త నాగ చైతన్యతో కలిసి కారులో షికారుకు వెళ్లిన ఫోటోను షేర్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ యేడాది సమంత... జాను సినిమాతో పలకరించింది. మంచి సినిమాగా టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. త్వరలో సమంత.. ‘ది ఫ్యామిలీ మెన్ 2’ సీజన్‌తో పలకరించబోతుంది. ఈ వెబ్ సిరీస్‌లో సమంత నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తోంది. మరోవైపు సమంత తమిళంలో రెండు ప్రాజెక్ట్‌లకు ఓకే చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa