తాజాగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ థియేటర్స్‌ను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. ఇప్పటికే కొంత మంది నిర్మాతలు తమ సినిమాలను లాక్‌డౌన్ కారణంగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో విడుదల చేస్తున్నారు.లాక్‌డౌన్ తర్వాత థియేటర్స్ ఓపెన్ అవుతాయా లేదా అనే విషయంలో ఇప్పటికీ క్లారిటీ లేదు. ఇప్పటికే కరోనా ఎఫెక్ట్ కారణంగా మన దేశంలోని అన్ని చిత్రపరిశ్రమలు దాదాపు రూ. 3 వేల కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్టు అంచనా. ఒక్క టాలీవుడ్ చిత్ర పరిశ్రమనే రూ. 800 కోట్ల మేర నష్టాలను చవిచూసినట్టు సమాచారం. గత 50ఏళ్లలో చిత్ర పరిశ్రమ ఇలాంటి గడ్డు పరిస్థితులను ఎపుడు చూడలేదు. కేవలం ఇది మన దేశానికి చెందిన చిత్ర పరిశ్రమకే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అన్ని చిత్ర పరిశ్రమలకు ఈ ఎఫెక్ట్ భారీగా ఉంది.. సినిమా కలెక్షన్లపై కరోనా ప్రభావం ఏ రకంగా ఉంటుందనే విషయం రెండు మూడు పెద్ద సినిమాలు విడుదలైతే కానీ తెలియదు. లాక్‌డౌన్ తర్వాత ప్రజలు థియేటర్స్ వైపు రావడానికి మల్టీప్లెక్స్ యాజమాన్యం ఇప్పటికే సీట్ల తగ్గించి మనిషికి మనిషికి మధ్య మూడు సీట్లు గ్యాప్ ఉండేలా సిటింగ్ సిస్టమ్ మార్చనున్నట్లు సమాచారం. మాములు సింగిల్ థియేటర్స్ యాజమాన్యం వాళ్లు కేవలం 50 శాతం టికెట్లు మాత్రమే అమ్మాలనే కొత్త నిబంధనను అనుసరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో థియేటర్స్‌ను ఆదుకోవడానికి థియేటర్స్‌లో వైన్, బీర్, బ్రీజర్ అమ్మకాలను చెేపట్టాలని ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ సూచిస్తున్నాడు. ఇప్పటికే విదేశాల్లో ఉన్న థియేటర్స్‌లో మద్యం అమ్ముతున్నారు. అదే తరహాలో ఇక్కడ థియేటర్స్‌లో కూడా మద్యం అమ్మితే కొద్దిలో కొద్దిగానైనా థియేటర్ రంగం పుంజుకుంటుందని చెప్పుకొచ్చారు. కరోనాతో పూర్తిగా చతికిల పడిన ఈ రంగాన్ని కాస్తో కూస్తో ఆదుకోవాలంటే ఇలాంటి నిర్ణయం తీసుకోక తప్పదన్నారు.ఈ విషయమైన హీరో రానాతో పాటు నిర్మాత సురేష్ బాబును కలిసి దీనిపై చర్చించినట్టు చెప్పుకొచ్చాడు. అదే విషయమైన నిర్మాతలందరు కలిసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే బాగుంటుందని అంటున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. థియేటర్స్‌లో మద్యం అమ్మాలనే నిర్ణయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయనేది చూడాలి. ఒకవేళ ఇచ్చినా.. ఫైవ్ స్టార్ తరహాలో ఎక్కువ రేటు ఉండే అవకాశం ఉంది. మొత్తానికి థియేటర్స్ రంగాన్ని ఆదుకోవడానికి మద్యం అమ్మకాలపై ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa