పవన్ సరసన మలయాళీ భామ మానస రాధాకృష్ణన్ నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. మానస మలయాళ చిత్రపరిశ్రమకి బాలనటిగా పరిచయమై.. ఆ తర్వాత హీరోయిన్‌గా అక్కడ ఓ పది సినిమాల వరకూ చేసింది. ఈ అమ్మాయి పవన్ సరసన నటించనుందని సోషల్ మీడియా కోడై కూసింది. ఇదంతా కేవలం పుకారు మాత్రమేనని దర్శకుడు హరీష్ శంకర్ స్పష్టం చేశాడు. ఇంతలోపే అసలు ఈ మానస ఎవరు అంటూ పవన్ అభిమానులతో పాటు ఇండస్ట్రీకి చెందిన సినీ దర్శక నిర్మాతలు ఆ అమ్మాయిని గురించి గూగుల్‌లో సెర్చ్ చేయడంతో పాటు ఆమె సినిమాల వివరాలను తెలుసుకున్నారు. అంతేకాదు యువ హీరోల సరసన ఈ భామ అయితే బాగుంటదని తాము నిర్మించే సినిమాల్లో హీరోయిన్‌గా పరిచయం చేయడానికి తెగ ఉత్సాహాన్ని చూపుతున్నారట. అందులో భాగంగా ఆ అమ్మాయిని సంప్రదించడం లాంటీవి కూడా మొదలైయ్యాయని టాక్. అలా ఈ అమ్మాయికి వరుస అవకాశాలు వెళుతున్నాయని అంటున్నారు. అలా ఓ రూమర్ ఈ అమ్మాయికి అవకాశాలను తెచ్చిపెడుతోంది అన్నమాట. చూడాలి మరి ఈ భామ ఏ యువ హీరో సరసన మెరవనుందో.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa