ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెటిజెన్ అడిగిన ప్రశ్నకు పూజా హెగ్డే ఆసక్తికర సమాధానం

cinema |  Suryaa Desk  | Published : Mon, May 18, 2020, 04:16 PM

తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో మాట్లాడుతూ ఓ నెటిజెన్ అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చింది పూజా హెగ్డే .లాక్ డౌన్ సమయంలో హోం క్వారంటైన్ లో ఉండాల్సి వస్తే... మీరు నటించిన హీరోలలో ఎవరితో ఉంటారు? వారి నుంచి ఏం నేర్చుకుంటారు? అని ఓ నెటిజెన్ ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా మహేశ్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్, హృతిక్ రోషన్ లతో కలిసి నటించానని... అవకాశం వస్తే అందరు హీరోలను నిర్బంధంలోకి తీసుకుని వారి నుంచి అనేక కొత్త విషయాలను నేర్చుకుంటానని చెప్పింది.ఒక్క హీరోనే స్వీయ నిర్బంధంలోకి తీసుకోవాల్సి వస్తే... హృతిక్ రోషన్ ను ఎంచుకుంటానని తెలిపింది. చిన్నప్పటి నుంచి హృతిక్ రోషన్ తన డ్రీమ్ హీరో అని చెప్పింది. బాలీవుడ్ లో తన తొలి హీరో ఆయనేనని.... ఆయన నుంచి ఎన్నో విషయాలను తెలుసుకుంటానని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa