ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాథూరాం గాడ్సే ఒక నిజమైన దేశభక్తుడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు

cinema |  Suryaa Desk  | Published : Tue, May 19, 2020, 02:30 PM

'ఈ రోజు నాథూరాం గాడ్సే పుట్టిన రోజు. నిజమైన దేశ భక్తుడు. గాంధీని చంపడం కరెక్టా కాదా? అనేది చర్చనీయాంశం. కానీ, అతని వైపు వాదనను ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది. (ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే)' అని పేర్కొన్నారు.'గాంధీని చంపితే అపఖ్యాతి పాలవుతానని తెలిసినా తను అనుకున్నది చేశాడు. కానీ, నాథూరాం దేశభక్తిని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒకసారి గుర్తు చేసుకోవాలనిపించింది. పాపం నాథూరాం గాడ్సే. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్' అని ట్వీట్ చేశారు. ఆయన వ్యాఖ్యలపై చాలా మంది నెటిజన్లు మండిపడుతున్నారు. గాంధీజీని చంపిన వ్యక్తిని గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa