మహిళలపై రేపుల విషయంలో కానీ, మూగ జీవాల సంరక్షణలోగాని.. సామాజిక అంశాలపై స్పందిస్తూ.. ట్వీట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని చెబుతూ సామాజికి స్పృహా ఉన్న అందాల యాంకర్‌గా పేరు తెచ్చుకుంది. ఈ లక్షణం మనం అందరిలో చూడలేము. నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ లో 6 ఏళ్ల బాలికతో పని చేయించారు. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ బాలిక వాచ్ మేన్ కుమార్తె. పక్కన ఉంటూ దీన్ని ఆపలేకపోయిన కానిస్టేబుల్ కు పైఅధికారులు చార్జ్ మెమో ఇష్యూ చేశారు. మరోవైపు దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై సినీ నటి, యాంకర్ రష్మి కూడా స్పందించింది. ఈ ఘటనను ఒక సాధారణ అంశంగా చూడకూడదని రష్మి చెప్పింది. ఇలాంటి ఘటనలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ గళాన్ని వినిపించాలని కోరింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa