అల్లుడు శీను సినిమాతో గ్రాండ్ గ ఏంట్రీ ఇచ్చిన రిచ్ కిడ్ బెల్లకొండ శ్రీనివాస్ సినిమా సినిమాకు బడ్జెట్ పెంచుతున్నాడు గాని తన మార్కెట్ ను మాత్రం పెంచుకోవడం లేదు. చేసిన ప్రతి సినిమా కమర్షియల్ యాంగిల్ లోనే ట్రై చేసినవే అయితే ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా క్లిక్కవ్వలేదు. ఇటీవల వచ్చిన రాక్షసుడు సినిమాపరవాలేధనిపించే విధంగా పాజిటివ్ టాక్ అందుకున్నప్పటికీ కలెక్షన్స్ అనుకున్నంతగా రాలేవు. బెల్లంకొండ శ్రీనివాస్ తన తదుపరి చిత్రాన్ని సుధీర్ వర్మ దర్శకత్వంలో చేయడానికి ఓకే చెప్పాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా, ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ 'అల్లుడు అదుర్స్' చిత్రంలో నటిస్తున్నాడు. లాక్ డౌన్ వల్ల ఈ చిత్రం షూటింగ్ ఆగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa