ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాగబాబుపై హైదరాబాదు పోలీస్ స్టేషన్ కేసు నమోదు.

cinema |  Suryaa Desk  | Published : Thu, May 21, 2020, 10:05 AM

నాథూరాం గాడ్సే జయంతి సందర్భంగా ఆయనపై నాగబాబు చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. అటు కాంగ్రెస్ నాయకులతో పాటు మరికొందరు కూడా ఈయన్ని టార్గెట్ చేస్తున్నారు. తాను ఎందుకలా అనాల్సి వచ్చిందో నాగబాబు చెప్పినా కూడా వినడం లేదు ఎవ్వరూ.నాధూరాం గాడ్సే ఒక నిజమైన దేశభక్తుడని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అయితే, గాడ్సేను తాను సమర్థించలేదని, ఆయన వెర్షన్ కూడా ప్రజలకు తెలియాలనే తాను ఇలా వ్యాఖ్యానించానని ఆయన చెప్పినప్పటికీ... విమర్శకుల ఆగ్రహం తగ్గలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాగబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నిరుద్యోగ జేఏసీ నేత మానవతారాయ్ ఉస్మానియా యూనివర్శిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాంధీని కించపరిచేలా వ్యాఖ్యానించిన నాగబాబుపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa