ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెట్రో లుక్ లో రెజినా

cinema |  Suryaa Desk  | Published : Thu, May 21, 2020, 10:48 AM

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి కుర్ర హీరోలతో ఆడిపాడిన అందాల భామ రెజినా కసాండ్రా.కెరియర్ ఆరంభంలో వరుసగా అవకాశాలు అందుకొని కుర్ర హీరోలకి ఫస్ట్ ఛాయస్ గా మారిన ఈ అమ్మడు తరువాత అవకాశాలకి దూరం అయిపొయింది.తమిళంలో అడపాదడపా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడుకి అనుకున్న స్థాయిలో చేతిలో అవకాశాలు లేవనే చెప్పాలి.చిరంజీవి ఆచార్య సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి ఈ అమ్మడు ఒకే చెప్పింది.ఇప్పటికే ఈ సాంగ్ షూటింగ్ జరిగినట్లు తెలుస్తుంది.గ్లామర్ ప్రదర్శనకి ఏ మాత్రం అభ్యంతరం చెప్పని రెజినా ఆ స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోతుంది.అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫోటోషూట్ లతో ఈ అమ్మడు సందడి చేస్తుంది.


తాజాగా బయటికి వచ్చిన రెజీనా ఫోటోలు చూసి ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.ఈమె మేకోవర్ చూసి రెజినా ఇలా అయిపోయింది ఏంటి అని అనుకుంటున్నారు.రెట్రో స్టైల్ లో ఈ అమ్మడు లుక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.పాతకాలపు ఫారిన్ భామల తరహాలో ఈమె మేకప్, లుక్స్ ఉన్నాయి.సౌత్ ఇండియన్ బ్యూటీగా హోమ్ప్లీ లుక్స్ లో కనిపించే రెజినా ఈ లుక్ లో అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదనే చెప్పాలి






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa