మాస్ మహారాజ్ రవితేజ కు ప్రస్తుతం సరైన హిట్ దక్కడం లేదు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన రాజా ది గ్రేట్ చిత్రం ఒక్కటే ఆయన అభిమానులకి కాస్త ఊరటనిచ్చింది. ప్రస్తుతం రవితేజ క్రాక్ చిత్రంతో ప్రేక్షకులని పలకరించనున్నాడు. ఈ సినిమా తర్వాత రవితేజ.. రాక్షసుడు ఫేం రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. రవితేజ- రాక్షసుడు చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుండగా, ఈ చిత్రానికి ఖిలాడీ అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. కోనేరు సత్యనారాయణ నిర్మించనున్న ఈ చిత్రంలో రవితేజ రెండు కోణాలలో కనిపించనున్నట్టు తెలుస్తుంది. చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.