ప్రభాస్, రాధాకృష్ణ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ ముందు జార్జియా షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌కు సిద్ధమవుతుంది. రీసెంట్‌గా ప్రభుత్వం షూటింగ్స్‌కు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ప్రభాస్ 20 యూనిట్ షూటింగ్‌కు సిద్ధమవుతుందట. నిజానికి ఈ షెడ్యూల్‌ను యూరప్‌లో చిత్రీకరించాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో యూనిట్ హైదరాబాద్ నుంచే ఏటూ వెళ్లలేకపోవడంతో ఈ సినిమా కోసం రూ.5 కోట్లు ఖర్చు పెట్టి ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ భారీ సెట్ వేస్తున్నారని సమాచారం. 1980 కాలపు బ్యాక్‌డ్రాప్‌లో ఈ హాస్పిటల్‌ను తీర్చిదిద్దారట. నెలరోజుల పాటు ఈ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నారని టాక్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa