ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిగ్ బాస్-4 లేటెస్ట్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jun 26, 2020, 08:56 PM

కరోనా కాటుకు ప్రతీ ఇండస్ట్రీ దెబ్బతింది. కరోనా ఉదృతి ఎక్కువవుతున్న కారణంగా బిగ్‌బాస్ సీజన్- 4లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, బిగ్‌బాస్ హౌస్ మొత్తాన్ని ఎలా మెయిన్‌టైన్ చేయాలనే దానిపై ప్రణాళిక రూపొందిస్తున్నారట బిగ్‌బాస్ నిర్వాహకులు. ఈ క్రమంలోనే తాజాగా ఓ కీలక అప్‌డేట్ బయటకొచ్చింది.ఈ సారి బిగ్‌బాస్ సీజన్- 4 ను కేవలం 50 రోజుల్లోనే ఫినిష్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాదు ప్రతి పార్టిసిపెంట్‌కి సెపరేట్ బాత్రూమ్స్‌, వాషింగ్ మెషీన్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నారని, ఈ మేరకు బిగ్‌బాస్ హౌస్‌లో మార్పులు చేర్పులు చేస్తున్నారని టాక్. గత సీజన్ బిగ్‌బాస్- 3 వంద రోజుల పాటు రన్ అయిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో పార్టిసిపెంట్స్ గొడవలు, ఆట- పాట, బిగ్‌బాస్ ఇచ్చే టాస్కులు అన్నీ హైలైట్ అయ్యాయి. మరి ఈ సారి చూస్తే ఆ పరిస్థితులు కనిపించడం లేదు. జులై నెలలో బిగ్‌బాస్ సీజన్- 4 గురించి పూర్తి క్లారిటీ రానుందని తెలిసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa