నితిన్-శాలినిల వివాహం హైదరాబాద్ లోని ఫలక్నుమా ప్యాలెస్ లో ఆదివారం రాత్రి 8:30 నిమిషాలకు ఘనంగా జరిగింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పెళ్లి వేడుకలు నిర్వహించారు. చక్కటి అలంకరణతో ముస్తాబైన ఫలక్ నుమా ప్యాలస్ లో వధూవరులు నితిన్ -శాలిని పెళ్లి దుస్తుల్లో ధగ ధగా మెరిసి పోయారు. వేద పండితుల సమక్షంలో నితిన్ మూడు ముళ్ళు వేసి ఓ ఇంటి వాడయ్యాడు. సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు వేడుకలో పాల్గొన్నారు. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్, యువ హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, కార్తికేయ తదితరులు హాజరై నితిన్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొత్త పెళ్లి కొడుకు నితిన్ 'మొత్తానికి ఓ ఇంటివాడినయ్యా. అందరూ ప్రేమతో దీవించండి' అంటూ ట్వీట్ చేశారు. నూతన దంపతులకు సోషల్ మీడియాలో పలువురు ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa