తన 30వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో స్టార్ హీరో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఈ మూవీకి ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ ఖరారు కావచ్చని టాక్. ఫుల్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో ఈ చిత్రం తెరకెక్కనున్నట్టు సమాచారం. ఇందులో తారక్ రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నాడట. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించి కొన్ని వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ సినిమాలో తారక్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారట. పూజా హెగ్డే, రష్మిక, సమంత ఈ ముగ్గురిలో ఒకర్ని ఎంపిక చేయనున్నారని సమాచారం. మరో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పేరు వినిపిస్తోంది. జాన్వీని ఇప్పటికే ఎంపిక చేశారని కూడా ఫిలింనగర్ టాక్. చూద్దాం ఏమవుతుందో.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa