హీరో శ్రీకాంత్ రారా సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ..తన రాజకీయ రంగ ప్రవేశంపై వస్తున్న వార్తలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.జనసేన అధినేత పవన్ కల్యాన్ మిమ్మలని పార్టీలోకి రమ్మన మని పిలిస్తే వెళ్తారా అన్న ప్రశ్నకు శ్రీకాంత్ బదులిస్తూ... తాను ఎట్టిపరిస్థితుల్లోనూ రాజకీయల్లోకి వెళ్లను అనిచెప్పారు. తనకు రాజకీయలపై అసలు అవగాహన లేదని.. అసలు రాజకీయాల్లో తాను ఇమడలేనని చెప్పారు. శ్రీకాంత్ కు మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి మంచి అనుబంధం ఉన్నది.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీప్రకటించిన సమయంలో స్టేజ్ పై చిరు ప్రక్కనే ఉన్నారు. కానీ పార్టీలో మాత్రం చేరలేదు. ఇప్పుడు జనసేన పార్టీలో తాను జాయిన్ కాక పోయినా... విజయం సాధించాలని కోరుకుంటానని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa