లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఊహలు గుసగుసలాడే, కళ్యాణవైభోగమే, జ్యోఅచ్యుతానంద వంటి సూపర్‌హిట్ చిత్రాల హీరో నాగశౌర్య, ఫిదా ఫేం సాయిపల్లవి జంటగా విజయ్ దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషలలో నిర్మించిన విభిన్న కథా చిత్రం కరు(తమిళం), కణం(తెలుగు). రెండు భాషలలో ఈ మూవీ వచ్చే నెలలో విడుదల కానుంది.. ఈ నేపథ్యంలో తెలుగు వెర్షన్ కణం మూవీ నుంచి తొలిసాంగ్ సంజాలి ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.. ఈ సాంగ్ ను అరవింద్ శ్రీనివాస్, అనూ ఆనంద్ ఆలపించారు.. కృష్ణ మద్దినేని సాహిత్యం అందించిన ఈ పాటకు శ్యామ్ సంగీతం సమకూర్చాడు. మీరూ ఈ సాంగ్ ను వినండి..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa