ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా తల్లిని మరోసారి కోల్పోయా

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 26, 2018, 12:53 PM

ముంబై: శ్రీదేవి మరణంపై ఆమె చివరి సి నిమా మామ్ (2017)లో కుమార్తెగా నటించిన పాక్ నటి సజల్ అలీ భావోద్వేగానికి గురయ్యారు. ఈ రోజు నా తల్లిని మరోసారి కోల్పోయాను అని అన్నారు. యాదృచ్చికంగా మామ్ సినిమా షూటిం గ్ సమయంలో సజల్ తల్లి మరణించా రు. సజల్ కష్టసమయంలో ఉండగా శ్రీదేవి ఆమెకు అండగా నిలిచారు. తల్లి మరణంతో తీవ్రమైన బాధలో ఉన్న సజల్‌ను శ్రీదేవి తన చేతుల్లోకి తీసుకుని సొంత కుమార్తెలా చూసుకున్నారు. ఈ విషాదం తర్వాత సజల్ పాక్ నుంచి శ్రీదేవికి ఫోన్ చేసి బోరున విలపించారు. ఈ అనుభవాన్ని తాను కేవలం సినిమాలా మాత్రమే చూడటం లేదని.. ఈ అనుబంధం తన హృ దయాన్ని తాకిందన్నారు. సాధారణంగా శ్రీదేవి తన సహచర నటులతో తొందరగా కలిసిపోరు. సెట్స్‌లో పూర్తి ప్రొఫెషనల్‌గా వ్యవహరిస్తారు. సజల్ విషయంలో మాత్రం భిన్నంగా స్పందించారు. ఆదివారం సజల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీదేవితో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ మరోసారి నా తల్లిని కోల్పోయా అని పోస్ట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa