యాంకర్ అనసూయ ఇప్పుడు సినిమాలలో బిజీ అయిపోయింది. ఇప్పటికే 'థ్యాంక్యూ బ్రదర్' సినిమాలో నటించగా.. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రంగమార్తాండ'లో కీలక పాత్రలో నటిస్తోంది. ఇక తాజాగా రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఖిలాడి' సినిమాలో అనసూయ ఓ ముఖ్య పాత్రలో నటిస్తోంది. ఈ సందర్భంగా బుధవారం అనసూయను తమ చిత్ర బృందంలోకి ఆహ్వానిస్తూ నిర్మాతలు ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అనసూయ ఇందులో గేమ్ చేంజర్ వంటిదని ఆమె పాత్రను ఉద్దేశిస్తూ దర్శకుడు రమేశ్ వర్మ హింట్ ఇచ్చారు. ఇక ఈ 'ఖిలాడి' సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa