రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ భామ అలియా సీత పాత్రలో రాంచరణ్ కి జోడీగా కనిపించనుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ ప్రముఖ దర్శకుడు శంకర్ తో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఈ చిత్రం పాన్ఇండియా లెవెల్ లో భారీగా తెరకెక్కబోతున్నది, ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇదివరకే వచ్చింది.కాగా ఈ చిత్రంలో హీరోయిన్ కోసం ఇప్పటికే పలువురు బాలీవుడ్ హీరోయిన్స్ ను సంప్రదించారు. చివరకు అలియానే హీరోయిన్ గా కన్ఫార్మ్ చేసినట్టు సమాచారం. ఈ మేరకు తమిళ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరవైపు శంకర్ తో చరణ్ సినిమా అనగానే అటు అభిమానుల్లో, ఇటు ఇండస్ట్రీ లో భారీ అంచనాలు మొదలయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa