వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమాతో కృతి షెట్టి ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందేప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో రామ్-లింగుసామి సినిమా ఉంది. దీంతోపాటు శ్యామ్ సింగరాయ్ ప్రాజెక్టులో కూడా నటిస్తోంది. అటు సుధీర్ బాబు-ఇంద్రగంటి సినిమాలో కూడా ఈమెనే హీరోయిన్. వీటిలో ఏదో ఒకటి పూర్తయితే తప్ప, కృతి షెట్టి కొత్త సినిమాపై క్లారిటీ రాదేమో. తను కొత్తగా ఏ సినిమాలు అంగీకరించలేదని, ప్రస్తుతం చేతిలో 3 సినిమాలు మాత్రమే ఉన్నాయని.. ఈమధ్య హీరోయిన్ కృతి షెట్టి క్లారిటీ ఇచ్చింది. ఆ మేరకు ఆమె చేస్తున్న 3 సినిమాల వివరాలు కూడా వెల్లడించింది. అయితే ఆమెతో సంప్రదింపులు మాత్రం ఆపడం లేదు మేకర్స్. తాజాగా ఇలానే మరో సినిమా కృతి షెట్టి వద్దకు చేరింది.
సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకుడిగా మారబోతున్నాడు. సాయితేజ్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా ఈ సినిమాను చాన్నాళ్ల కిందటే ప్రకటించారు. సుకుమార్ దీనికి కథ అందిస్తున్నాడు. ఇప్పుడీ సినిమాలో హీరోయిన్ గా కృతి షెట్టిని ప్రయత్నిస్తున్నారు. సుకుమార్ రిఫరెన్స్ తో కృతి షెట్టిని కలిసిన దర్శకుడు, ఆమెకు కథ నెరేట్ చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa