రచయిత శ్రీధర్ సీపాన దర్శకత్వం వహిస్తున్న చిత్రం బందావనమిది అందరిది. జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ వంగల, ప్రభాకర రెడ్డి కూతురు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా మేకింగ్ వీడియో విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ వైజాగ్ సాగరతీరంలో వేసిన హీరోయిన్ ఇంటి సెట్‌లో సన్నివేశాలు, ఆ పరిసర ప్రాంతాల్లో రిచా పణయ్, హర్షవర్థన్ రానే, శివప్రసాద్, హీరా పాహిలి, బెనర్జీ, తాగుబోతు రమేష్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. దర్శకత్వం చేయడం ఇదే ప్రధమం అయినప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేదు. అందరూ సహకరిస్తున్నారు. తొలి షెడ్యూల్ మేకింగ్ వీడియో టీజర్ విడదల చేశాం. మంచి స్పందన వచ్చింది అని చెప్పారు.
రిచా పణయ్, హర్షవర్థన్ రానే, లగడపాటి విక్రమ్, పృథ్వీ, శివప్రసాద్, హీరా సాహిలి, బెనర్జి, తాగుబోతు రమేష్, భద్రం, అదుర్స్ రఘు, బొడ్డ నారాయణ, సత్యం రాజేష్, రజిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ, ఛాయాగ్రహణం తమ్మ శ్యామ్, పాటలు సిరివెన్నెల.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa