సుశాంత్ రెడ్డి దర్శకత్వం లో మేఘా ఆకాష్, అదిత్ అరుణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తూ తాజా చిత్రం డియర్ మేఘా. ఈ చిత్రం నుండి విడుదల అయిన పోస్టర్లు, టీజర్, లిరికల్ వీడియో సాంగ్స్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా కి సంబందించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. 2020 లో కన్నడ లో సూపర్ హిట్ సాధించిన దియా చిత్రానికి ఇది రీమేక్ అవ్వడం తో సినిమా తెలుగు లో ఎలా ఉంటుంది అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం సెప్టెంబర్ మూడవ తేదీన థియేటర్ల లోకి తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయినట్లు తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa