ప్రముఖ నటి శ్రీదేవి మరణం యావత్ దేశాన్ని ఎంతటి షాక్ కు గురి చేసిందో తెలిసిందే. దేశ ప్రజలకే ఇంత వేదనకు గురి చేసినప్పుడు.. ఇక కపూర్ ఫ్యామిలీలో మరెంత విషాదాన్ని నింపిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. పెద్ద కోడలి ఆకస్మిక మరణంతో డీప్ షాక్ లో ఉన్న కపూర్ కుటుంబంలో త్వరలో ఒక శుభకార్యం జరగనుందన్న విషయం తాజాగా బయటకు వచ్చింది.
శ్రీదేవి విషాదాన్ని అధిగమించేందుకు తాజా శుభకార్యం సాయంగా ఉంటుందని భావిస్తున్నారు. శ్రీదేవి మరిది అనిల్ కపూర్ కుమార్తె.. టాప్ హీరోయిన్లలో ఒకరైన సోనమ్ కపూర్ త్వరలోనే పెళ్లిపీటల మీదకు ఎక్కనున్నట్లు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ఆసక్తికర కథనాన్ని ఒక మ్యాగ్ జైన్ ప్రముఖంగా ప్రచురించింది.
32 ఏళ్ల సోనమ్ కపూర్ ఇప్పటికే తన బాయ్ ఫ్రెండ్ కమ్ వ్యాపారవేత్త ఆనంద్ ఆహుజాతో గడిచిన కొంత కాలంగా లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీరి పెళ్లికి ఇరు కుటుంబాల వారు ఓకే అనేసిన వైనం బయటకు వచ్చింది. అన్ని అనుకున్నట్లు జరిగితే మే 11 లేదంటే మే 12 తేదీల్లో సోనమ్ పెళ్లి జరుగుతుందని చెబుతున్నారు. అతిధులు వచ్చేందుకు వీలుగా ఫ్లైట్ టికెట్స్ ను ఇప్పటికే బుక్ చేసినట్లుగా తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa