శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా "లవ్ స్టోరీ". ఈ సినిమా ఈ నెల 24న థియేటర్లలో విడుదల కానుంది. అయితే తాజాగా నిన్న ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ట్రైలర్ సినీ అభిమానులను ఆకట్టుకుంటోంది. ట్రైలర్‌లో శేఖర్ కమ్ముల మార్క్ కనిపించడంతో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ట్రైలర్ విడుదలైన కొద్ది గంటల్లోనే 4 మిలియన్ ప్లస్ వ్యూస్‌ని రాబట్టడమే కాకుండా, 300K ప్లస్ లైక్స్‌ని కొల్లగొట్టింది. ట్రైలర్ చూశాక సినిమాపై ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలు పెరిగాయనే చెప్పాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa